మిల్కీ బ్యూటీ క్వారెంటైన్ పూర్త‌యింది!

మిల్కీ బ్యూటీ క్వారెంటైన్ పూర్త‌యింది!
మిల్కీ బ్యూటీ క్వారెంటైన్ పూర్త‌యింది!

మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా ఫ్యామిలీ ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. వారు కోలుకున్న త‌రువాత హైద‌రాబాద్ వ‌చ్చింది. ఇక్క‌డి సినిమాల్లో న‌టించే నిమిత్తం ముంబై నుంచి హైద‌రాబాద్ వ‌చ్చేసింది. అయితే  త‌మ‌న్నాకు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో వెంట‌నే ప్రైవేట్ ఆసుప‌త్రిలో చేరింది. 14 రోజుల పాట డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు క్వారెంటైన్‌లోనే వుండిపోయింది.

దీంతో ఆమె అభిమానుల్లో ఆందోళ‌న మొద‌లైంది. త‌మ అభిమాన తార‌కు ఎలా వుందో అని టెన్ష‌న్ ప‌డ్డారు. ఇది గ‌మ‌నించిన త‌మ‌న్నా తాజాగా త‌ను కోలుకున్న విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంది. కోవిడ్ నుంచి కోలుకున్న త‌మ‌న్నా తిగిరి ముంబై వెళ్లిపోయింది. త‌న ఇంటికి చేరుకుంది. 14 రోజుల పాటు క్వారెంటైన్‌కే ప‌రిమిత‌మైపోయిన త‌మ‌న్నా గురువారం ముబైలోని త‌న ఇంటికి వెళ్లిపోయింది.

త‌న వాళ్లు ఎదురుగా వ‌చ్చి త‌మ‌న్నాని రిసీవ్ చేసుకోవ‌డం, త‌మ‌న్నాని చూసి ఆమె త‌ల్లి భావోద్వేగానికి గురికావ‌డం వీడియోలో క‌నిపిస్తోంది. 3 నిమిషాల పాటు ఈ వీడియోని షూట్ చేశారు. ఈ వీడియోలో ఏయిర్ పోర్ట్ నుంచి నేరుగా త‌న అపార్ట‌హెంట్‌కి చేరుకున్న త‌మ‌న్నా త‌న త‌ల్లిదండ్రుల్ని భావోద్వేగానికిలోనై ఆలింగ‌నం చేసుకుంది. `నేను ఇంటికి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. కొంత సమయం గడపడానికి, గొప్ప అనుభూతి చెందడానికి మరియు తిరిగి పని చేయడానికి నేను ఇంట్లో ఉంటాను. నేను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను రేపటి నుండి నా శక్తిని పెంచుకుంటాను`అని తెలిపింది త‌మ‌న్నా.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on