సైరాలో మిల్కీ బ్యూటీ పాత్ర ఇదే!


Tamannah Bhatia
Tamannah Bhatia

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలకు ముస్తాబవుతోంది. భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి ప్రమోషన్స్ కూడా భారీగానే ఉండేలా మేకర్స్ ప్లాన్ చేసారు. ఇప్పటికే ప్రమోషన్స్ ఎక్కడ ఎలా చేయాలో అన్నది ఒక ప్రణాళిక వేశారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సైరా లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒక కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. తాజాగా మీడియాతో మాట్లాడుతూ సైరాలో తన పాత్ర గురించి గొప్పగా చెప్పింది. ఈ చిత్రంలో తాను లక్ష్మి అనే పాత్ర చేస్తున్నట్లు చెప్పింది తమన్నా. తన కెరీర్ లోనే ఇది ఒక ప్రత్యేకమైన పాత్రని, అది చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అంతే కాకుండా సైరా హిందీ వెర్షన్ లో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుందని తెలియజేసింది తమన్నా.