మహేష్ కు సరిలేరు అంటున్న తమన్నా


Mahesh Babu And Tamannah Bhatia
మహేష్ కు సరిలేరు అంటున్న తమన్నా

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 26వ సినిమాగా సరిలేరు నీకెవ్వరు చేస్తోన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన కీలకమైన సీన్ల చిత్రీకరణ హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ లో జరుగుతోంది. సెప్టెంబర్ 13 వరకూ జరిగే ఈ షెడ్యూల్ మహేష్, విజయశాంతి మధ్య సీన్లు మిగతా ఆర్టిస్ట్ ల కలయికలో చిత్రీకరిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ కోసం తనకు బాగా అచొచ్చిన మీనాక్షి దీక్షిత్ ను తీసుకుందామని మహేష్ భావించగా దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం ఆ పాటలో తమన్నా అయితే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడట. దీంతో తమన్నా మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ లో ఆడిపాడనుంది. వీరిరువురు ఇదివరకు ఆగడు సినిమాలో కలిసి నటించిన విషయం తెల్సిందే. తమన్నా ఈ ఏడాది ఎఫ్ 2 తో సూపర్ హిట్ అందుకోగా, సైరాలో ఒక ముఖ్యపాత్రలో నటించింది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరులో మహేష్ తో ఒకపాటలో కలిసి చిందులేయనుంది.