చిరు కోసం మ‌ళ్లీ మిల్క్ బ్యూటీని దించేస్తున్నారా?


చిరు కోసం మ‌ళ్లీ మిల్క్ బ్యూటీని దించేస్తున్నారా?
చిరు కోసం మ‌ళ్లీ మిల్క్ బ్యూటీని దించేస్తున్నారా?

మెగాస్టార్ చిరంజీవి కోసం మ‌ళ్లీ మిల్క్ బ్యూటీ త‌మ‌న్నాను దించేస్తున్నారా? అంటే టాలీవుడ్ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చారిత్రాత్మ‌క చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` ఈ చిత్రంలో ల‌క్ష్మి పాత్ర‌లో సైరా ప్రియురాలిగా త‌మ‌న్నా క‌నిపించిన విష‌యం తెలిసిందే. మ‌రోసారి త‌మ‌న్నా చిరు చిత్రంలో క‌నిపించే అవ‌కాశం వుంద‌ని తాజాగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌,  మ్యాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై హీరో రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్‌రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. అభ్యుద‌య భావాలున్న ఎండోమెంట్ అధికారిగా మెగాస్టార్ ఈ చిత్రంలో క‌నిపించ‌బోతున్నారు.

రామ్‌చ‌ర‌ణ్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించ‌నున్న ఈ  చిత్రం కోసం స్వ‌ర బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ 5 పాట‌ల్ని సిద్ధం చేశారు. ఈ పాట‌ల్లో ఇప్ప‌టికే రెజీనాపై ప్ర‌త్యేక గీతంగా చిత్రీక‌రించారు. మ‌రో స్పెష‌ల్ సాంగ్‌ని త‌మ‌న్నా, చిరుపై చిత్రీక‌రించాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇందుకు త‌మ‌న్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.