త‌మ‌న్నాకు బంప‌ర్ ఆఫ‌ర్‌?


త‌మ‌న్నాకు బంప‌ర్ ఆఫ‌ర్‌?
త‌మ‌న్నాకు బంప‌ర్ ఆఫ‌ర్‌?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాకు నిజంగా ఇది బంప‌ర్ ఆఫ‌రే. గోపీచంద్‌తో క‌లిసి `సీటీమార్‌` చిత్రంతో న‌టిస్తున్న త‌మ‌న్నాకు ఇటీవ‌ల భారీ ఆఫ‌ర్ త‌గ‌ల్లేద‌నే చెప్పాలి. భారీ చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న త‌మ‌న్నా ప్ర‌స్తుతం ఆ స్థాయి ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకోలేక‌పోతోంది. అయితే ఇలాంటి ప‌రిస్థితిలో వున్న త‌మ‌న్నాకు ద‌ర్శ‌కుడు ఏ.ఆర్‌. మురుగ‌దాస్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఆయ‌న తాజాగా ఓ భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు.

2012లో విజ‌య్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం `తుపాకి`. ఏ. ఆర్‌. మురుగ‌దాస్ టాలెంట్‌కి, ఆయ‌న భిన్న‌మైన క‌థ‌ల్ని ఎంచుకునే తీరుకి అద్దంప‌ట్టిన చిత్ర‌మిది. ఈ చిత్రంతో స్లీప‌ర్ సెల్స్ గురించి ప్ర‌తీ ఒక్క‌రికీ తెలిసేలా చేశారాయ‌న‌. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ని చేయ‌బోతున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన ఈ మూవీ సీక్వెల్లో విజ‌య్ హీరోగా న‌టించ‌బోతున్నారు. ఆయ‌న‌కు జోడీగా త‌మ‌న్నాను ద‌ర్శ‌కుడు ఎంపిక చేసిన‌ట్టు కోలీవుడ్ టాక్‌.

దాదాపు ప‌దేళ్ల క్రితం వ‌చ్చిన `సుర‌` చిత్రంలో విజ‌య్‌, త‌మ‌న్నా జోడీగా న‌టించారు. మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌రువాత జోడీక‌డుతుండ‌టం విశేషంగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ `మాస్ట‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. `ఖైదీ` ఫేమ్ లోకేష్ క‌న‌క‌రాజ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా వుంది.