సైరా లో “పాల అందం” మురిపిస్తుందా?


Tamannaah Role is Interesting in Syeraa
Tamannaah Role is Interesting in Syeraa

మిల్కీ బ్యూటీ “తమన్న” పేరు చెప్పగానే సన్నజాజి, నాభి అందం, వన్నె తరగని అభినయం ఒక్కొక్కటి ఒక్కొక్క వర్ణం తో చెప్పొచ్చు. సినిమాల విషయంలో మాత్రం ఎంచుకున్న పాత్రలు ఆమెకి పెద్ద పేరు తెచ్చిపెట్టడం లేదు.

బాహుబలి” ఇంకా కొన్ని సినిమాలు మాత్రమే చెప్పుకోవటానికి మాత్రమే ఉన్నాయి కానీ, తమన్నపేరుకి కనీసం ఒక్క పేరు వచ్చే సినిమా కానీ, ఆమె పేరు ఇట్టే చెప్పగలిగే ఆధారాలు, సినిమాలు ఏమి లేవు.

ఇప్పుడు “సైరా” మీదనే తన ఆశలు. నిజానికి మొదట కూడా సహాయక పాత్ర అని అనుకొని చేసిందట, ఒప్పుకుందట. కానీ నిన్న ట్రైలర్ చూసిన వెంటనే తమన్న కి మంచి రోల్ దొరికింది అని చూస్తే అర్ధం అయిపోతుంది.

“లక్ష్మి అనే నా పేరు ముందు నరసింహా అని మీ పేరు ఇవ్వండి చాలు” అని చిరంజీవి గారితో అంటుంది. అంటే ఇందులో “నయనతార” కి, తమన్నా కి సమపాళ్ళలో దక్కే భర్త గా చిరంజీవి గారు ఉండొచ్చు అని అంత అనుకుంటున్నారు.

ఏది ఏమైనా తమన్న కి మాత్రం గట్టి సినిమా గా సైరా ఉండాలి, ఆమెకి తగ్గ పేరు రావాలి అని కోరుకుందాం.