తమన్నా మొత్తానికి పని కానిచ్చేసింది

తమన్నా మొత్తానికి పని కానిచ్చేసింది
తమన్నా మొత్తానికి పని కానిచ్చేసింది

మారుతున్న కాలానికి తగినట్లుగా నటులు కూడా అప్డేట్ అవుతున్నారు. ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్స్ రాజ్యమేలుతున్నాయి. భవిష్యత్తు కూడా వాటికే ఉంటుందన్న ప్రచారాల నేపథ్యంలో నటులు సైతం ఓటిటి చూపులు చూస్తున్నారు. మొదట్లో స్టార్ హీరోలు, హీరోయిన్లు ఓటిటిలో వెబ్ సిరీస్ లు, సినిమాలు చేయడానికి అంత ఆసక్తి చూపించేవారు కాదు. క్రమంగా వాటికి దక్కుతున్న ఆదరణ నేపథ్యంలో ఆలోచనలు మారుతున్నాయి.

మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఇటీవలే ఓటిటి బాట పట్టిన విషయం తెల్సిందే. 11త్ అవర్ అనే టైటిల్ తో వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు తమన్నా ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను కూడా ఇటీవలే విడుదల చేసారు.

తాజా సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయింది. తమన్నా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఈ యూనిట్ ను మిస్ అవుతున్నాను అని పోస్ట్ చేసింది. ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించగా ఆహాలో ఇది స్ట్రీమ్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)