కాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్


Tamannah sensational comments on casting couch
Tamannah Bhatia

కాస్టింగ్ కౌచ్ అనేది గతకొంత కాలంగా టాలీవుడ్ ని పట్టి పీడిస్తోంది . కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో అట్టుడికిన టాలీవుడ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది . ఒకవైపు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా మరోవైపు దాన్ని ఖండించే వాళ్ళు కూడా ఉన్నారు . ఇక తాజాగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలను ఖండిస్తూ సంచలనం సృష్టించింది తమన్నా . ఇంతకీ తమన్నా చెబుతున్నదేంటో తెలుసా ….. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనేది లేదని .

కోట్ల కొద్దీ డబ్బులు పెట్టి సినిమా నిర్మించేది హీరోయిన్ లతో పడుకోవడానికి కాదని , అలాగే హీరోలు ఎవరు కూడా హీరోయిన్ లను వేధించలేదని , నాకు మాత్రం ఇలాంటి అనుభవాలు నాకు ఎదురు కాలేదని స్పష్టం చేసి షాక్ ఇచ్చింది తమన్నా . కాస్టింగ్ కౌచ్ కు గురయ్యా అంటూ ఇటీవలే ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పేర్కొంది . చాలామంది హీరోయిన్ లు , నటీమణులు కూడా పేర్కొన్నారు కానీ తమన్నా మాత్రం అలాంటిదేమి లేదని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది ఏంటో మరి.

English Title: Tamannah sensational comments on casting couch