ఆహా! తమన్నా టాక్ షో వివరాలివే

ఆహా! తమన్నా టాక్ షో వివరాలివే
ఆహా! తమన్నా టాక్ షో వివరాలివే

మిల్కీ బ్యూటీ తమన్నా ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఒక టాక్ షో ను ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. ఈ మేరకు డీల్ కూడా కుదిరినట్లు వార్తలు వచ్చాయి. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్వయంగా అడగడంతో తమన్నా ఈ షోకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన కాఫీ విత్ కరణ్ షో తరహాలో ఇది కూడా ఎంటర్టైనింగ్ గా సాగే ఒక టాక్ షో అని సమాచారం. వివిధ సెగ్మెంట్లు ఇప్పటికే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

అల్లు అరవింద్ వంటి నిర్మాత బ్యాకింగ్, తమన్నా వంటి హోస్ట్ ఉంటే ఎవరైనా ఈ షోకు రాకుండా ఎలా ఉంటారు. ఇదే ప్లాన్ లో ఆహా టీమ్ ఇప్పటికే ఈ షోకు సెలెబ్రిటీల లిస్ట్ ను ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే మొదటి ఎపిసోడ్ ను మెగాస్టార్ చిరంజీవితో చేస్తారట.

వీలైనంత త్వరలో ఒక ప్రైవేట్ స్టూడియోలో ఈ షో తాలూకా సెట్ నిర్మాణం మొదలవుతుందని, మళ్ళీ స్టార్స్ షూటింగ్స్ అంటూ బిజీ కాకముందే వీలైనన్ని ఎక్కువ ఎపిసోడ్స్ ను చిత్రీకరించాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. చూడాలి మరి ఈ షో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో.