జెమినీ టివి కోసం షో కు సైన్ చేసిన తమన్నా

జెమినీ టివి కోసం షో కు సైన్ చేసిన తమన్నా
జెమినీ టివి కోసం షో కు సైన్ చేసిన తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా తన కెరీర్ ను తెలివిగా ప్లాన్ చేసుకుంటోంది. ఇప్పటికే హీరోయిన్ గా దశాబ్దానికి పైగా కెరీర్ ను కొనసాగించింది. ఇక మిగతా హీరోయిన్ల దూకుడు ఎక్కువవడంతో తమన్నా రూట్ మార్చింది. నితిన్ మేస్ట్రోలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఒప్పుకుంది. ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ లు చేసింది. సత్యదేవ్ లాంటి యంగ్ హీరోల సరసన నటించడానికి ఓకే చెప్పింది.

ఇప్పుడు టీవీ హోస్ట్ గా మారబోతోంది. జెమినీ టీవీలో మాస్టర్ చెఫ్ తరహాలో ఒక కుకింగ్ షో రానుంది. ఈ షో కు హోస్ట్ గా తమన్నా వ్యవహరిస్తారు. ఇప్పటికే అగ్రిమెంట్ కూడా పూర్తయిందని, తమన్నా భారీ పారితోషికాన్ని తీసుకుంటోందని తెలుస్తోంది. కన్నడలో ఇదే ప్రోగ్రామ్ కు కిచ్చా సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

ఈ కుకింగ్ షో గురించి ప్రస్తుతం మరిన్ని వివరాలు బయటకు రావాలంటే కొన్ని రోజుల సమయం పడుతుంది.