ఆగస్ట్ నుండి తమన్నా మాస్టర్ చెఫ్ తెలుగు!

ఆగస్ట్ నుండి తమన్నా మాస్టర్ చెఫ్ తెలుగు!
ఆగస్ట్ నుండి తమన్నా మాస్టర్ చెఫ్ తెలుగు!

దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో  టాప్ హీరోయిన్ గా కొనసాగింది తమన్నా. రీసెంట్ గా ఓటిటి కంటెంట్ కు, బుల్లితెరకు కూడా పచ్చజెండా ఊపిన విషయం తెల్సిందే. తమన్నా ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ లు చేసింది. నితిన్ హీరోగా చేసిన మేస్ట్రో చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించింది తమన్నా.

ఈ సినిమా డైరెక్ట్ ఓటిటిలో వచ్చే నెల విడుదల కానుంది. అలాగే గోపీచంద్ హీరోగా సీటిమార్ సినిమాను కూడా పూర్తి చేసింది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక తమన్నా బుల్లితెర మీద కూడా ఎంట్రీ ఇస్తోంది. మాస్టర్ చెఫ్ తెలుగు వెర్షన్ ను మొదలుపెట్టారు. జెమినీ టివి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. గత నెల తమన్నా ఈ కార్యక్రమం ప్రోమో షూట్ లో పాల్గొంది. విజయ్ సేతుపతితో కలిసి ప్రోమో షూట్ చేశాను అని సోషల్ మీడియాలో పేర్కొంది.

తాజా సమాచారం ప్రకారం ఈ కార్యక్రమం ఆగస్ట్ మూడో వారం నుండి ప్రసారం కాబోతోంది. దీనికి తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి.