అభినేత్రి 2 కూడా ప్లాప్ జాబితాలో


ఈరోజు మూడు సినిమాలు విడుదల కాగా సువర్ణ సుందరి అనే సినిమా రిలీజ్ ఆగిపోయింది . ఇక అందులో అభినేత్రి 2 కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది . తమన్నా , ప్రభుదేవా నందితా శ్వేత కలిసి నటించిన చిత్రం అభినేత్రి 2 . తమిళ దర్శకులు ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు విడుదల అయ్యింది . పెద్దగా పబ్లిసిటీ లేకుండానే విడుదలైన ఈ చిత్రం కు ప్లాప్ టాక్ వచ్చేసింది .

అభినేత్రి యావరేజ్ కావడంతో దానికి సీక్వెల్ గా అభినేత్రి 2 చేసారు . ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ జరుపుకుందో తెలీదు కానీ సడెన్ గా టీజర్ తో ముందుకు వచ్చారు . కట్ చేస్తే ఈరోజు విడుదల కూడా అయ్యింది . అయితే తమన్నా , నందితా శ్వేత , ప్రభుదేవా ల నటన బాగున్నప్పటికీ కథనం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో డిజాస్టర్ గా తేల్చేస్తున్నారు ప్రేక్షకులు . మొత్తానికి మూడు సినిమాలు రిలీజ్ అయితే అందులో ఫలక్ నుమా దాస్ మాత్రమే కాస్త బెటర్ గా ఉంది . మిగతావి హామ్ ఫట్ .