తమన్నా టాక్ షో మొదలయ్యేది అప్పుడే!

తమన్నా టాక్ షో మొదలయ్యేది అప్పుడే!
తమన్నా టాక్ షో మొదలయ్యేది అప్పుడే!

ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా కోసం తమన్నా టాక్ షో ను ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. అల్లు అరవింద్ స్పెషల్ గా ఈ టాక్ షో పై ఆసక్తి చూపిస్తున్నాడట. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైన ఈ టాక్ షో తాజా సమాచారం ప్రకారం దసరా నుండి మొదలుకానుందని తెలుస్తోంది. దసరా రోజున ఈ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేస్తారట. తమన్నా హోస్ట్ కావడంతో టాక్ షో కు కావలసినంత గ్లామర్ వచ్చేసింది. టాలీవుడ్ నుండే కాక తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలను కూడా ఈ టాక్ షో లో భాగం చేయాలని చూస్తున్నారు. కేవలం ఒక ఇంటర్వ్యూలా కాకుండా ఈ టాక్ షో చాలా ఫన్నీగా ఉండబోతోందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్స్ కు ఆదరణ బాగున్న నేపథ్యంలో ప్రత్యేకంగా తెలుగు వారి కోసం రూపొందించిన ఈ ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో టాక్ షో తో పాటు వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ లను కూడా అల్లు అరవింద్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.