చంపేస్తామని బెదిరించడంతో సారీ చెప్పాడు


Tamil actor Manoj Prabhakar apologizes for making fun on Mahesh Babuమహేష్ బాబు ని ఘోరంగా అవమానించిన తమిళ నటుడు ఎట్టకేలకు మహేష్ బాబుతో పాటుగా మహేష్ అభిమానులకు క్షమాపణ చెప్పాడు . టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబుని ఓ చిన్న నటుడు అవమానించడంతో మహేష్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మనోజ్ ప్రభాకర్ అనే తమిళ నటుడిపై యుద్ధం ప్రకటించారు . చంపేస్తామని బెదిరించడంతో , ఫోన్లు చేసి హెచ్చరించడంతో మెసేజ్ లు పెట్టడంతో దెబ్బకి దిగొచ్చాడు . నేను కావాలని మహేష్ బాబుని అవమానించలేదు కేవలం స్పైడర్ చిత్రంలోని నటనని మాత్రమే ప్రాతిపదికగా వివరించాలని ప్రయత్నం చేసాను అది ఇలా బెడిసికొట్టింది అంతేకాని మహేష్ ని కావాలని అవమానించలేదు అంటూ సుదీర్ఘ వివరణ ఇస్తూ క్షమాపణ చెబుతున్నాడు .

ఇప్పటికే మహేష్ బాబు అభిమానులతో పాటుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా మనోజ్ ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని నడిగర్ సంఘం కు లేక రాసిన నేపథ్యంతో పాటుగా మహేష్ అభిమానుల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో కళ్ళు బైర్లు కమ్మి సారీ చెప్పాడు . అయితే ఈ నటుడు ఎంత వివరణ ఇచ్చినప్పటికీ , క్షమాపణ చెప్పినప్పటికీ మహేష్ అభిమానుల కోపం మాత్రం ఇప్పట్లో తగ్గేలా లేదు మరి .

English Title: Tamil actor Manoj Prabhakar apologizes for making fun on Mahesh Babu

Manoj Prabakar

Hello People, I can see that there have been a lot of comments, posts, and messages being posted since yesterday across all my social media platforms, all of them with respect to one of the video…