ఆర్ ఆర్ ఆర్ లో తమిళ నటుడు


Tamil actor Samuthirakani in RRR 

ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ ” . ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం హిందీ , తెలుగు , తమిళ , మలయాళ బాషలలో విడుదల కానుంది . దాంతో కేవలం టాలీవుడ్ ఆర్టిస్ట్ లను మాత్రమే కాకుండా ఇతర బాషా నటీనటులను కూడా తీసుకోనున్నారు జక్కన్న . అందులో భాగంగానే ఆర్ ఆర్ ఆర్ లో తమిళ నటుడు సముద్రఖని ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది .

చరణ్ బాబాయ్ గా సముద్రఖని నటించనున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే ఒక షెడ్యూల్ ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ని వచ్చే నెల 19 నుండి జరుపుకోనుంది . రామోజీ ఫిలిం సిటీ లో అయిదు రోజుల పాటు రెండో షెడ్యూల్ ని చిత్రీకరించనున్నారు జక్కన్న . సముద్ర ఖని నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా . సముద్ర ఖని నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి , టాలీవుడ్ ప్రేక్షకులకు సముద్రఖని సుపరిచితుడే ! అయితే నేరుగా తెలుగులో నటిస్తున్న చిత్రం మాత్రం ఇదే !

English Title: Tamil actor Samuthirakani in RRR