ఐసీయూలో త‌మిళ న‌టుడు వివేక్‌‌!

ఐసీయూలో త‌మిళ న‌టుడు వివేక్‌‌!
ఐసీయూలో త‌మిళ న‌టుడు వివేక్‌‌!

ప్రముఖ కోలీవుడ్ నటుడు వివేక్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో చెన్నైలో ఆసుపత్రిలో చేరారు.  ఆయ‌న పరిస్థితి విష‌మంగా ఉందని, ఐసియులో మరింత చికిత్స అవసరమని త‌మిళ సినీ వ‌ర్గాలు  ధృవీకరిస్తున్నాయి. నిన్న గురువారం వివేక్ ప్రభుత్వ ఒమాండురార్ ఆసుపత్రిలో కోవిడ్ -19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ విష‌యాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ వార్తను అభిమానుల‌తో పంచుకున్నారు.

అయితే శుక్ర‌వారం వివేక్‌ని చెన్నైలోని సిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం గుండెపోటు తో పాటు ఆయ‌న ఆరోగ్య ప‌రీస్థితిలో ఆకస్మిక మార్పు కార‌ణంగానే ఆయ‌న‌ని ఐసీయూలో చేర్చిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ప్ర‌ధాన కార‌ణం ఏంట‌న్న‌ది మాత్రం ఇంకా తెలియరాలేదు. వివేక్ అప‌స్మార‌క స్థితిలో వున్నార‌ని, ఆయ‌న ప‌ల్స్ కొట్టుకోవ‌డం లేద‌ని, మా ప్ర‌య‌త్నం మేము చేస్తున్నామ‌ని` ఓ వైద్యుడు ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

ఇదిలా వుంటే వ్యాక్సిన్ తీసుకున్న త‌రువాత వివేక్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వ్యాక్సిన్ తీసుకోండ‌ని ప్ర‌చారం చేస్తూ ట్వీట్ లు చేశారు. `వ్యాక్సిన్ల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజలు భయపడకూడదు. కోవిషీల్డ్ , కోవాక్సిన్ రెండూ సురక్షితమైనవి. మమ్మల్ని అవి మాత్రమే రక్షిస్తాయి. ఇవి మనల్ని వ్యాధి బారిన పడకుండా నిరోధించకపోయినా అది సంక్రమణ తీవ్రతను తగ్గిస్తుంది`అని తమిళంలో ట్వీట్ చేశారు.