ఆత్మహత్య చేసుకున్న నటుడి భార్య


tamil actor wife commits suicideపిల్లలు పుట్టడం లేదని తీవ్ర మనస్తాపంతో పాటుగా భర్త తో తరచుగా జరుగుతున్న గొడవలతో ఆత్మహత్య చేసుకుంది ఓ నటుడి భార్య . తమిళనాట సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలలోకి వెళితే …… తమిళ చిత్రాల్లో సహాయ నటుడిగా నటిస్తున్న సిద్దార్థ్ మధురవాయిల్ లో భార్యతో కలిసి నివసిస్తున్నాడు . మూడేళ్ళ క్రితం స్మిరిజ ని పెళ్లి చేసుకున్నాడు సిద్దార్థ్ అయితే మొదట్లో వీరి కాపురం సజావుగానే సాగింది అయితే కాలం గడుస్తోంది తప్ప పిల్లలు పుట్టడం లేదు దాంతో ఇద్దరి మధ్య గొడవలు తరచుగా జరుగుతుండేవి .

అయితే సంఘటన జరిగిన రోజు కూడా స్మిరిజ – సిద్దార్థ్ లు ఓ హోటల్ కి వెళ్లి భోజనం చేసి ఇంటికి చేరుకున్నారు , ఇంటికొచ్చాకా మళ్ళీ పిల్లల గురించి టాపిక్ రావడంతో మళ్ళీ గొడవలు అయ్యాయట ! దాంతో ఆవేశంలో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది స్మిరిజ , సిద్దార్థ్ మాత్రం హాల్లోనే పడుకున్నాడు తెల్లవారి లేచి తలుపులు తట్టగా తలుపులు తెరుచుకోలేదు దాంతో పోలీసులకు సమాచారం అందించాడు సిద్దార్థ్ . పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా స్మిరిజ ఫ్యాన్ కు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించడంతో ఆమెని ఆసుపత్రికి తరలించారు . పోస్ట్ మార్టం తర్వాత అసలు విషయాలు తెలుస్తాయని , స్మిరిజ ఆత్మహత్య చేసుకుందా ? లేదా అన్నది తేలుతుందని అంటున్నారు పోలీసులు .

English Title: tamil actor wife commits suicide