ఆత్మహత్య చేసుకుందామనుకుందట


tamil actress charmila reacts her suicide attempts కెరీర్ బాగున్నప్పుడు లైఫ్ స్టైల్ ని బాగా ఎంజాయ్ చేసి , ఇప్పుడు ఆర్ధికంగా చితికిపోయిన సమయంలో అవకాశాలు ఇవ్వండి అంటూ వేడుకుంటోంది మాజీ హీరోయిన్ ఛార్మిళ అనే తమిళ నటి . నల్లడోరు కుటుంబం , తైయల్ క్కారన్ ,ముస్తఫా మనసే మౌనమా , కిళక్కే వరుమ్ పాట్టు తదితర చిత్రాల్లో నటించింది ఛార్మిళ . అయితే కెరీర్ బాగున్న సమయంలో వస్తున్న డబ్బు ని విచ్చలవిడిగా ఖర్చు చేసిందట !

పైగా పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని ఇబ్బందులు రావడంతో ఇంటిని అమ్మేసింది దాంతో మానసికంగా క్రుంగి పోయింది ఛార్మిళ . అంతేకాదు అనారోగ్యంతో కూడా బాధపడుతోంది అయితే తనకు వచ్చిన దుస్థితి తో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట కానీ మంచాన పడిన తల్లి , కొడుకు భవిష్యత్ కోసం ఆత్మహత్య నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నానని ….. నాకు సినిమాల్లో అవకాశాలు ఇస్తే మళ్ళీ ఆర్ధికంగా నిలదొక్కుకుంటానని అంటోంది చార్మిళ . అయితే ఈ నటి అభ్యర్ధన ని చిత్ర పరిశ్రమ పట్టించుకుంటుందా ? అవకాశాలు ఇస్తుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ! ఎందుకంటే మహానటి సావిత్రి చివరి రోజుల్లో ఆమెని పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు , అంత్యక్రియల సమయంలో కూడా తెలుగు , తమిళ చిత్ర పరిశ్రమల నుండి పెద్దగా హాజరయ్యింది కూడా లేదు కానీ ఇప్పుడు మహానటి సినిమా రాగానే ఆహా ! ఓహో ! అంటూ ఆమె గొప్పతనాన్ని గురించి చెబుతున్నారు . అంతటి విచిత్రమైన పరిశ్రమ ఈ చిత్ర పరిశ్రమ .