మహానటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తమిళులు


tamil audience fire on mahanatiమహానటి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధిస్తోంది ఇక తమిళనాట కూడా విడుదల అయ్యింది ” నడిగయి తిలగం ” పేరుతో . అక్కడ కూడా ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది కాకపోతే తమిళనాట జెమిని గణేశన్ కు ఎక్కువ ఇమేజ్ ఉంది కాబట్టి అతడ్ని దాదాపుగా కొన్ని సీన్లలో చూపించిన దాన్ని బట్టి విలన్ గానే చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమిళులు . తమిళనాట జెమినీ గణేశన్ కు తిరుగులేని ఇమేజ్ ఉంది . ప్రేమకు రారాజు అన్న బిరుదు అతడి సొంతం , తమిళనాట అగ్ర హీరో కూడా దాంతో అక్కడ అతడికి అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువే !

మహానటి తమిళ చిత్రాన్ని చూసిన జెమిని గణేశన్ కూతుర్లు కూడా మహానటి చిత్ర బృందం పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . జెమిని గణేశన్ ని తప్పుగా చూపించారని అందుకే ఆయన ఎలాంటి వాడో తెలియజెప్పే విధంగా ఓ డాక్యుమెంటరీ రూపొందించనున్నట్లు స్పష్టం చేసారు . ఇక తమిళ ప్రేక్షకులు అయితే సావిత్రి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూనే జెమిని గణేశన్ ని మాత్రం విలన్ గా చూపించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .