ఆ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడా ? హత్య చేసారా


tamil director c. sivakumar found dead at his houseతమిళ దర్శకులు సి . శివకుమార్ తన ఇంట్లోనే శవమై కనిపించడం సంచలనం సృష్టిస్తోంది . తమిళంలో పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సి . శివకుమార్ చెన్నై లోని తన అపార్ట్ మెంట్ లో శవమై కుళ్లిపోయి దుర్గంధం తో ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తోంది . శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక ఎవరైనా హత్య చేసారా ? అన్న కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు .

అర్జున్ నటించిన ఆయుధ పూజ చిత్రానికి దర్శకత్వం వహించాడు అలాగే అజిత్ హీరోగా నటించిన రెట్టయి జాడి వయసు చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు . ఇవే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన శివకుమార్ మరణం తమిళ సినీ వర్గాలను షాక్ కి గురిచేసింది . శివకుమార్ మరణం పై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . ఇతడ్ని ఎవరైనా హత్య చేసారా ? లేక ఇతర ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా ? అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది . పోస్ట్ మార్టం నివేధిక వస్తే అసలు విషయం తెలుస్తుందని భావిస్తున్నారు పోలీసులు .

English Title: tamil director c. sivakumar found dead at his house