పవన్ ను కలిసిన తమిళ దర్శకుడు.. అసలు ఏం జరుగుతోంది?


Pawan Kalyan
పవన్ ను కలిసిన తమిళ దర్శకుడు.. అసలు ఏం జరుగుతోంది?

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇప్పుడు పెద్దగా చేసే కార్యక్రమాలు ఏం లేకపోవడంతో కచ్చితంగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఇన్ డైరెక్ట్ గా తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని చెబుతున్నప్పటికీ ఈ ప్రచారాలకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు.

ఇదిలా ఉండగా తమిళ దర్శకుడు హరి ఇటీవలే పవన్ కళ్యాణ్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రేసీ స్క్రీన్ ప్లేతో యాక్షన్ లవర్స్ ను మెప్పించగల హరి పవన్ కు ఒక టెరిఫిక్ కథను సెట్ చేసినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చింది.

ఇదిలా ఉండగానే దర్శకుడు క్రిష్ కూడా పవన్ ను కలిసి ఒక ఎమోషనల్ కంటెంట్ ఉన్న స్క్రిప్ట్ ను నరేట్ చేసాడట. ఈ స్క్రిప్ట్ కు ఫ్లాట్ అయిన ఏఎం రత్నం, పవన్ దగ్గర ఎలాగూ తన అడ్వాన్స్ ఉంది కాబట్టి ఈ సినిమాను నిర్మించాలని భావిస్తున్నాడు. ఇదంతా బానే ఉంది కానీ తనని కలుస్తున్న దర్శకనిర్మాతలకు పవన్ చేస్తాననో, చేయననో స్పష్టంగా చెప్పకపోవడం గమనార్హం.