ఆ హీరో ఎందుకిలా చేస్తున్నాడు


Tamil hero Jai caught red handed again by Police

తమిళ హీరో జై ని తాజాగా తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు మందలించి వదిలేసారు దాంతో ఈ విషయం దావానలంలా వ్యాపించింది . హీరో అయిన జై మంగళవారం రాత్రి నుంగంబాక్కమ్ మెయిన్ రోడ్ లో పెద్దగా హారన్ మ్రోగిస్తూ అత్యంత వేగంగా వెళ్లడంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు తీవ్ర భయబ్రాంతులకు లోనయ్యారు . ఈ విషయం ట్రాఫిక్ పోలీసులకు తెలియడంతో జై కారుని వెంబడించి మరీ పట్టుకున్నారు . ఇంతపెద్దగా సైరన్ మ్రోగించాల్సిన అవసరం ఏముంది ఇలా చేయడం నేరం అంటూ అతడిపై ట్రాఫిక్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కేసు నమోదు చేయడానికి సిద్ధం అవ్వగా పోలీసులను బ్రతిమిలాడి తన తప్పు ని ఒప్పుకొని ఇకపై ఇలాంటి పొరపాట్లు చేయనని అక్కడి నుండి వెళ్ళిపోయాడట .

ఇంతకుముందు కూడా రెండుసార్లు హీరో జై తప్పతాగి పోలీసులకు చిక్కాడు . 2014 లో ఒకసారి ట్రాఫిక్ పోలీసుల వాహనాన్నిఢీ కొట్టాడు అలాగే గత ఏడాది 2017 లో అడయార్ బ్రిడ్జి సమీపంలోని గోడ ని గుద్దాడు . అయితే అవి గతంలో కాగా ఇప్పుడు మళ్ళీ జై వివాదంలో ఇరుక్కోవడానికి కారణం అంజలి తో వచ్చిన విబేధాలే కారణం అని తెలుస్తోంది . హీరోయిన్ అంజలి – జై లు ఇద్దరూ ప్రేమించుకున్న విషయం తెలిసిందే . ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య విబేధాలు పొడచూపడంతో జై ఇలా అయిపోయాడని టాక్ మరి .