క‌రోనా స‌హాయ‌నిధికి త‌మిళ హీరో భారీ విరాళం

క‌రోనా స‌హాయ‌నిధికి త‌మిళ హీరో భారీ విరాళం
క‌రోనా స‌హాయ‌నిధికి త‌మిళ హీరో భారీ విరాళం

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. అగ్ర రాజ్యాలు సైతం దీని ధాటికి అల్లాడిపోతున్నాయి. ఏ దేశం గురించి విన్నా క‌రోనా మ‌ర‌ణాలే. క‌రోనా సోకిన కేసులే. దీంతో దేశాల‌న్నీ లాక్ డౌన్‌ని విధించాయి. దీంతో అంత‌టా   జ‌న జీవితం స్థ‌భించిపోయింది. ఎక్క‌డ జ‌న సందోహం క‌నిపించ‌డం లేదు. అంతా క‌రోనా వైర‌స్ భ‌యంతో ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు.

ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడ‌టం కోసంసెల‌బ్రిటీలు క‌రోనా క‌ట్ట‌డి కోసం భారీ స్థాయిలో విరాళాలు అందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు క‌రోనా క‌ట్ట‌డిలో స‌హాయం చేస్తున్నారు.  సినీ సెల‌బ్రిటీలు మేము సైతం అంటూ ముందు కొస్తున్నారు. కోట్ల‌కు కోట్లు విరాళం ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ కోటి 30 ల‌క్ష‌లు విరాళాన్ని అందించారు.

ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెరో 5 ల‌క్ష‌లు అందించారు. ప్ర‌ధాన మంత్రి స‌హాయ‌నిధికి 25 ల‌క్ష‌లు, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి 50 ల‌క్ష‌లు, కేర‌ళ సీఎం స‌హాయ నిధికి 10 ల‌క్ష‌లు, క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి , పుదుచ్చేరి  ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి క‌లిపి 10 ల‌క్ష‌లు విరాళం అందించారు. ఫెఫ్సీకి అసోసియేష‌న్ నిధికి 25 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు.