కెన‌డాలో చిక్కుకున్న స్టార్ హీరో త‌న‌యుడు!

కెన‌డాలో చిక్కుకున్న స్టార్ హీరో త‌న‌యుడు!
కెన‌డాలో చిక్కుకున్న స్టార్ హీరో త‌న‌యుడు!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచం మొత్తం లాక్ డౌన్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. ఏ దేశం గురించి విన్నా క‌రోనా కేసులే. చైనాలోని పుహాన్ న‌గ‌రంలో పుట్టిన వైర‌స్ ఇప్పుడు ప్ర‌పంచ దేశాల్లో విళ‌య‌తాండ‌వం చేస్తోంది. ఎక్కడ చూసినా క‌రోనా మ‌ర‌ణాలే. దీంతో దేశాల‌న్నీ ఈ మ‌హ‌మ్మారిని త‌రిమి కొట్టాలంటే లాక్ డౌన్ ఒక్క‌టే మార్గ‌మ‌ని లాక్ డౌన్ విధించాయి.

మ‌న దేశంలోనూ ముందు 21 రోజుల పాటు లాక్ డౌన్‌ని విధించారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌రో 19 రోజుల పాటు పొడిగించ‌డం తెలిసిందే. దీంతో ఇత‌ర దేశాల్లో స్ట్ర‌క్క‌యిపోయిన వారంతా మే 3 ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అంద‌రిలాగే త‌మిళ స్టార్ హీరో విజ‌య్ కూడా మే 3 కోసం ఆందోళ‌న‌గా ఎదురుచూస్తున్నాడ‌ట‌.

విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ కెన‌డాలో వుంటున్నాడు. అక్క‌డ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ నేర్జుకుంటున్నాడు. కోవిడ్ కార‌ణంగా లాక్ డౌన్ విధించ‌డంతో అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌న్నీ ర‌ద్ద‌య్యాయి. దీంతో విజ‌య్ త‌న‌యుడు కెన‌డాలోనే చిక్కుకు పోయాడు. దీంతో హీరో విజ‌య్ ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాడ‌ట‌.