బాహుబలిని టార్గెట్ చేస్తూ చతికిలపడుతోన్న తమిళ సినిమాTamil movies failing to beat Baahubali records
Tamil movies failing to beat Baahubali records

తమిళ సినిమాల్లో సహజత్వం ఎక్కువగా ఉంటుంది. నేటివిటీకి దగ్గరగా తీసే తమిళ ఫిల్మ్ మేకర్స్ నుండి అత్యద్భుతమైన సినిమాలు ఎన్నో వచ్చాయి. నేషనల్ లెవెల్లో ఈ సినిమాలు గుర్తింపు పొందాయి. ఒకానొక దశలో సౌత్ సినిమాలు అంటే తమిళ సినిమాలే అనుకునే రేంజ్ లో డామినేట్ చేసాయి. నిజంగా మాట్లాడుకుంటే తమిళ సినిమాలు ఇప్పటికీ అంతే క్రియేటివిటీ, కొత్తగా ఆలోచించే తత్త్వం ఉంది. కాకపోతే ఇప్పుడు తెలుగు సినిమాలు బాగా మారాయి. ఇదివరకు కేవలం కమర్షియల్ హంగులున్న సినిమాలకే ఓటు వేసే తెలుగు ప్రేక్షకుల అభిరుచిలో కూడా మార్పు వచ్చింది. కొత్తదనమున్న సినిమాలకు జనాలు పట్టం కడుతున్నారు. మరోవైపు తమిళ సినిమాలు బాగుంటాయి కానీ తమ సినిమానే గొప్ప అనే ఫీలింగ్ అక్కడి ఫిలిం మేకర్స్, మీడియా, ప్రేక్షకులకు కూడా ఉంది. తమ సినిమాలను అన్ని భాషల్లో డబ్బింగ్ చేయాలనుకునే వీరు, ఏదైనా డబ్బింగ్ సినిమా వచ్చిందంటే మాత్రం ఆదరించడానికి ఇష్టపడరు. అక్కడ మీడియా కూడా డబ్బింగ్ సినిమాలను విస్మరిస్తోంది. రీసెంట్ గా చిరంజీవి సైరా విషయంలో తమిళ మీడియా ప్రవర్తన చూసాం.

అసలు ఈ సినిమా ఒకటి రిలీజ్ అయిందనే విషయం కూడా తెలీనట్లు ప్రవర్తించారు. చిరంజీవి సినిమా పరిస్థితే ఇలా ఉంటే వేరే హీరోల పరిస్థితి గురించి కొత్తగా చెప్పేదేముంటుంది. అలాంటి తమిళ మీడియా ఒక సినిమాను భుజాన మోయాల్సి వచ్చింది. ఫిల్మ్ మేకర్స్ కూడా ఈ సినిమా గురించి పొగడాల్సి వచ్చింది. ఈ రెండు సరిగ్గా జరగడంతో తమిళ ప్రేక్షకుల దృష్టి కూడా ఆ సినిమాపై పడింది. అదే బాహుబలి. తెలుగువారు ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే సినిమాను అందించాడు ఎస్ ఎస్ రాజమౌళి. ఈ సినిమా తమిళనాట ప్రభంజనాన్ని సృష్టించింది. ఏకంగా 158 కోట్ల గ్రాస్ వసూళ్లతో తమిళ సినిమాల్లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది బాహుబలి. ఒక తెలుగువాడు తీసిన సినిమా తమిళనాట హయ్యస్ట్ గ్రాసర్ గా ఉండడంతో తమిళ వాళ్ళ అహం దెబ్బతింది. అందుకే ఎలాగైనా బాహుబలిని తలదన్నే సినిమా తీయాలని అక్కడి ఫిలిం మేకర్స్ కలలుకంటున్నారు. కొన్ని భారీ బడ్జెట్ ప్రయత్నాలు చేసారు. కానీ అవి చతికిలపడ్డాయి.

బాహుబలి తర్వాత విజయ్ పులి అనే సినిమా చేస్తే అది దారుణమైన ప్లాప్ గా మిగిలింది. బాహుబలిని కచ్చితంగా కొడుతుంది అని అక్కడి జనాలు ఆశలు పెట్టుకున్న 2.0 బాహుబలికి చాలా దూరంలో నిలిచింది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అజిత్ విశ్వాసం ఓపెనింగ్స్ తో అదరగొట్టడంతో కచ్చితంగా బాహుబలి రికార్డు చెరిగిపోయినట్లే అని ఆశపడ్డారు. అయితే విశ్వాసం 131 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇటీవలే విడుదల చేసిన విజయ్ బిగిల్ కూడా 138 కోట్ల గ్రాస్ ను సాధించింది. కానీ బాహుబలిని దాటలేకపోయింది. ఇక బిగిల్ ఫుల్ రన్ కు కూడా చేరుకున్న క్రమంలో ఇప్పట్లో బాహుబలి రికార్డును దాటేవాడు ఎవడూ లేడనుకోవచ్చు. మరి ఈ సంక్రాంతికి వస్తున్న రజినీకాంత్ దర్బార్ తో ఏదైనా మ్యాజిక్ చేస్తాడో చూడాలి.