
తమిళ హీరో సూర్య నిర్మించే చిత్రాల్నిథియేటర్లలో ప్రదర్శించబోమని కోలీవుడ్‌లో థియేటర్ల యాజమాన్యం వివాదాస్పద నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లు వెల్లుతున్నాయి. జ్యోతికలో సూర్య 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై `పోన్ మగల్ వందల్` అనే చిత్రాన్ని నిర్మించారు. మేలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
అయితే ఉన్నట్టుండి కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభించడంతో కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం లాక్‌డౌన్‌ని విధించింది. ఈ నేపథ్యంలో థియేటర్లు తెరుచుకోవాలంటే మరింత సమయం పట్టే అవకాశం వుందని తెలియడంతో హీరో సూర్య తను నిర్మించిన `పోన్ మగల్ వందల్` చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయం తెలిసిన తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం మరోసారి ఈ నిర్ణయాన్ని పరిశీలించుకోవాలని కోరింది. దీనికి సూర్య అంగీకరించకపోవడంతో ఆయనకు సంబంధించిన నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చే చిత్రాలని నిషేధిస్తున్నట్టు ప్రకటించాయి. దీనికి పై కొంత మంది నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 మంది వరకు నిర్మాతలు సూర్యకు అండగా నిలిచారు. దీంతో వివాదం మరో మలుపు తిరిగే అవకాశం వుందని కోలీవుడ్‌లో వినిపిస్తోంది.