25 లక్షల విరాళం ప్రకటించిన స్టార్ హీరోలు


Tamil star heroes announce 25 lakhs donations for flood victims

వరద భీభత్సంతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది . మూడు రోజులుగా కేరళలోని పలు ప్రాంతాలు నీట మునిగి పోవడంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు , వేలాది మందికి తిండి , నీళ్లు లేక అల్లాడిపోతున్నారు . ప్రాణనష్టం తో పాటుగా పెద్ద ఎత్తున ఆస్థి నష్టం కూడా సంభవించింది దాంతో చలించిపోయిన తమిళ స్టార్ హీరోలు సూర్య , కార్తీ లు తమ వంతు సహాయంగా 25 లక్షల ఆర్ధిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి కి అందించారు . సూర్య – కార్తీ లు అన్నాదమ్ములు అన్న విషయం తెలిసిందే . సహాయ కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు ముందుండే ఈ సోదరులు మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు .

తమిళ హీరోలు అయినప్పటికీ తమిళనాట ఆపద వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా విపత్కర పరిస్థితులు ఎదురైనపుడు , సంభవించినప్పుడు తక్షణం స్పందిస్తూ ఆర్ధిక సహాయం అందిస్తున్నారు . ఇంతకుముందు తెలుగు రాష్ట్రాలలో కూడా వరదలతో అతలాకుతలం అయినపుడు తమ వంతు బాధ్యతగా స్పందించి సహాయం అందించారు . సినిమా హీరోలు గానే కాకుండా రియల్ హీరోలు అనిపించు కుంటున్నారు ఈ తమిళ సోదరులు .

English Title: tamil star heroes announce 25 lakhs donations for flood victims