ఇదేం విచిత్రం..హీరో మీద నిర్మాత కేసు విచారణ అంటా….


Shimbhu and Gnanavel Raja
Shimbhu and Gnanavel Raja

సినిమా నిర్మాతలు అంటేనే వాళ్ళకి లెక్క లేనంతగా సమస్యలు వచ్చి పడుతుంటాయి  చిన్న ఆర్టిస్టులు దగ్గర నుండి పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్  వాళ్ళని అందరిని చూసుకోవాలి, వాళ్ళకి రోజులు ఖాళీగా ఉన్నాయా లేదా అని సినిమా మొదలవ్వకముందే చూసుకోవాలి…అలాంటిది విచిత్రం తమిళ పరిశ్రమ  లో  జరిగింది.

తమిళ సినిమా హీరో మీద  తమిళ పెద్ద నిర్మాత  కె.ఈ. జ్ఞానవేల్ రాజా కేసు పెట్టారు. అసలు విషయం ఏమిటంటే మన తమిళ హీరో ‘శిoబు’ గారు  షూటింగ్ కి రావడంలేదు.  వచ్చిన అన్ని రోజులు సరిగ్గా  దర్శకుడు కి సహాయం చేయకుండా  తన పని తను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు  అంటా. సినిమాలోని మిగిలిన వారికి శిoబు చేసినది ఇబ్బంది అవుతుంది. నిర్మాత కి డబ్బు ఖర్చు ఎక్కువ  అవుతుంది.
మరి కె.ఈ. జ్ఞానవేల్ రాజా గారి సమస్య కి పరిష్కారం ఎలా దొరుకుతుందా అని అలోచించి చివరికి తమిళ సినిమా నిర్మాతల మండలి వారికి తన గోడు  చెప్పుకొని బాధ పడ్డాడు. నిజంగానే ఒక నిర్మాతకి పెద్ద హీరోల వలన ఇలాంటి చేదు అనుభవం రావడం సినిమా చరిత్రలో ఇది మొదటిసారి అని అనుకుంటున్నారు తమిళ సినిమా వర్గాల వాళ్ళు.
మరి అసలు కథ ఏమిటో? దీంట్లో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే శిoబు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే తప్ప ఈ సమస్య తీరనిది.