విశాల్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు


vishal
vishal

తమిళనాట స్టార్ హీరోగా వెలుగొందుతున్న విశాల్ కు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చారు తమిళనాడు రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీ . నడిగర్ సంఘం ఎన్నికలు ఈనెల 23న జరగాల్సిన విషయం తెలిసిందే . విశాల్ తెలుగువాడు కావడంతో తమిళనాట తెలుగువాడి పెత్తనం ఏంటి ? అంటూ అప్పుడే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు . ఇక సీనియర్ దర్శకులు భారతీరాజా అయితే ఏకంగా విశాల్ ని పందికొక్కు తో పోల్చాడు .

నడిగర్ సంఘం నుండి 61 మందిని సస్పెండ్ చేయడంతో వాళ్ళు సొసైటీ రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేసారు . దాంతో స్పందించిన సొసైటీ రిజిస్ట్రార్ నడిగర్ సంఘం ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు . తొలగించిన సభ్యుల సంగతి తేలాక ఎన్నికలు నిర్వహించనున్నారు . దాంతో విశాల్ కు భారీ షాక్ తగిలినట్లే అని అంటున్నారు . ఎందుకంటే తొలగించిన 61 మందికి ఓటు హక్కు కల్పిస్తే వాళ్ళు అంతా విశాల్ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేసేవాళ్ళు కాబట్టి .