డైరెక్టర్ శంకర్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు


tamilnadu high court shock director shankarదక్షిణ భారతంలో విశిష్ట దర్శకుడైన శంకర్ కు తమిళనాడు హైకోర్టు షాక్ ఇచ్చింది , శంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పది వేల రూపాయల జరిమానా కూడా విధించింది . సంఘటన వివరాలలోకి వెళితే ……. రజనీకాంత్ఐశ్వర్య రాయ్ జంటగా శంకర్ దర్శకత్వంలో 2010 లో రూపొంది సంచలన విజయం సాధించిన చిత్రం ” రోబో ”. అయితే ఆ రోబో చిత్ర కథ నాదే అంటూ ఆరూర్ తమిళ్ నాడన్ చెన్నై హైకోర్టు ని ఆశ్రయించాడు. ఆరూర్ తమిళ్ నాడన్ విజ్ఞప్తి మేరకు శంకర్ కోర్టుకి వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారే చేసినప్పటికీ శంకర్ రాకుండా కేవలం లిఖిత పూర్వకంగా సమాధానం పంపించాడు అంతేకాదు రోబో కథ నేను రాసుకున్నదే తప్ప ఆరూర్ తమిళ్ నాడన్ ది కాదని చెప్పడమే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమయ్యింది .

ఇంతకుముందే కోర్టు నోటీసులు జారీ చేసినప్పటికీ శంకర్ ఖాతరు చేయలేదు దాంతో న్యాయస్థానానికి కోపం వచ్చింది దాంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పదివేల రూపాయల జరిమానా విధించింది . రోబో సీక్వెల్ గా తాజాగా 2. 0 చిత్రాన్ని రూపొందిస్తున్నాడు శంకర్ . దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది 2. 0 అయితే ఈ సమయంలో శంకర్ పై కోర్టు ఆగ్రహం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి .

English Title: tamilnadu high court shock director shankar