118 చిత్రాన్ని లీక్ చేసిన తమిళ రాకర్స్


Tamilrockers leaks 118 full movie 

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 118 చిత్రాన్ని లీక్ చేసి షాక్ ఇచ్చింది తమిళ రాకర్స్ . చిన్న సినిమా , పెద్ద సినిమా అన్న తేడా లేకుండా మేము ఎలాంటి సినిమానైనా లీక్ చేస్తామని చాటి చెప్పడానికి ఇప్పటికే పలు చిత్రాలను లీక్ చేసి సవాల్ విసిరింది తమిళ రాకర్స్ . ఇక ఇప్పుడేమో కళ్యాణ్ రామ్ చిత్రాన్ని లీక్ చేసింది . మార్చి 1 న రిలీజ్ అయిన 118 చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది . దాంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . కట్ చేస్తే సినిమా మొత్తం లీకైన విషయం తెలుసుకొని షాక్ అవుతున్నారు .

 

ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మించాడు . కళ్యాణ్ రామ్ సరసన శాలిని పాండే నటించగా నివేదా థామస్ కీలక పాత్రలో నటించింది . సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంతో కళ్యాణ్ రామ్ సంతోషంగా ఉన్నాడు . కళ్యాణ్ రామ్ కు ఈ చిత్రం మంచి పేరు తెచ్చింది . అయితే సినిమా మొత్తం లీక్ అయ్యిందన్న విషయం మాత్రం వణుకు పుట్టిస్తోంది .

English Title: Tamilrockers leaks 118 full movie