రాయ్ లక్ష్మికి షాక్ ఇచ్చిన తమిళ రాకర్స్

Tamilrockers leaks full movie Raai laxmi's Where Is The Venkatalakshmiహాట్ భామ రాయ్ లక్ష్మి కి షాక్ ఇచ్చింది తమిళ రాకర్స్ . రాయ్ లక్ష్మి తాజాగా ” వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి ” అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే . కాగా నిన్న వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి చిత్రం రిలీజ్ అయ్యింది . ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా సినిమా మొత్తం లీక్ చేసి పడేసారు తమిళ రాకర్స్ . అగ్ర హీరోల చిత్రాలను మాత్రమే లీక్ చేయడం కాదు చిన్న చిత్రాలను సైతం మేము వదిలి పెట్టేది లేదు అంటూ షాక్ ఇస్తున్నారు తమిళ రాకర్స్ .

 

ఇప్పటివరకు చాలా చిత్రాలను లీక్ చేసినప్పటికీ , వాళ్ళని కట్టడి చేయడంలో అటు ప్రభుత్వం కానీ ఇటు చిత్ర పరిశ్రమ కానీ పూర్తిగా విఫలమయ్యింది . సవాల్ చేసి మరీ సినిమాలను లీక్ చేస్తున్నారు తమిళ రాకర్స్ . ఇక రాయ్ లక్ష్మి వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి చిత్ర విషయానికి వస్తే నిన్న రిలీజ్ అయ్యింది కానీ ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకునేలా లేకపోవడంతో వసూళ్లు అంతగా లేవు .

English Title : Tamilrockers leaks full movie Raai laxmi’s Where Is The Venkatalakshmi