మరాఠా మహాయోధుడు తానాజీ వీరగాధ


మరాఠా మహాయోధుడు తానాజీ వీరగాధ
మరాఠా మహాయోధుడు తానాజీ వీరగాధ

ప్రపంచం అయినా, చరిత్ర అయినా, ఎక్కువగా గుర్తు పెట్టుకునేది విజేతలను; వారి గెలుపును. కానీ భావి తరాలకు స్ఫూర్తి ఇచ్చేది మరియు ఎప్పుడు చరిత్ర గతిని మలుపు తిప్పగలిగే సత్తా నిస్వార్ధంగా త్యాగం చేసిన మహనీయుల వల్లే సాధ్యం అవుతుంది. అలా చరిత్ర పుటల్లో ఇప్పటిదాకా అంతగా ప్రాధాన్యత పొందని మరాఠా అమర వీరుడు సుబేదార్ తానాజీ మాల్సారి.

“గడ్ ఆయా పన్ సింహ్ గిలా రే – మజా సింహ్ గిలా” అని ప్రతి ఒక్క మరాఠీ గుండె పాడుకునే ఆ యోధుని కథను ఇన్నేళ్ళకు బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ ప్రేక్షకులకు వెండితెర మీద చూపించారు. సినిమా మొదలైన కొద్ది క్షణాలకే అందరూ మరాఠా సామ్రాజ్యానికి, రాయ్ గడ్ కోట, కొండాన కోట దగ్గర ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఇక నటుడిగా, అజయ్ దేవ్ గణ్ నటన అయితే మన గుండె ఉప్పొంగేలా ఉంటుంది. ఒక సగటు భారతీయుడిగా ఈ గడ్డ మీద పుట్టినందుకు గర్వపడతాం. ఇక తానాజీ భార్యగా నటించిన అజయ్ నిజజీవిత భాగస్వామి కాజోల్ పాత్ర నిడివి పరంగా తక్కువ ఉన్నా, మనల్ని మెప్పిస్తుంది.

ఈ సినిమాలో ముఖ్యంగా హైలెట్ అయ్యింది.. రాజపుత్ర సర్దార్ “ఉదయ భాన్ సింగ్ రాథోడ్” గా నటించిన సైఫ్ అలీ ఖాన్. పతాక సన్నివేశాల్లో ఆయన క్రూరత్వం మనల్ని నిజంగానే భయపెడుతుంది. ఇక సైఫ్ కెరియర్ బెస్ట్ పెర్ఫామెన్స్ గా ఈ పాత్ర నిలిచిపోతుంది. సాచేత్ – పరంపర అందించిన సంగీతం, రంజాన్ బులుత్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ మనల్ని సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెడతాయి. ఇక దర్శకుడు ఓం రౌత్ కి తొలి సినిమా అయినా, ఆయన తెరకెక్కించిన విధానం చూస్తే మాత్రం అద్భుతం అనిపిస్తుంది. 2 గంటల 10 నిమిషాల నిడివితో, ప్రతీ క్షణం ఉత్కంతతో వార్, హిస్టారికల్, యాక్షన్ జోనర్ లో హైలెవల్ ఎమోషనల్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది ప్రస్తుతానికి రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో బెస్ట్ అని చెప్పవచ్చు.