త‌నికెళ్ళ భ‌ర‌ణి అమ్మ బ్ర‌తికే వుంది!

Tanikella Bharani new film amma brathike vundi
Tanikella Bharani new film amma brathike vundi

విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో న‌టుడిగా, ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు న‌టులు త‌నికెళ్ల భ‌ర‌ణి. క్యారెక్ట‌ర్ ఆర్తిస్టుగా , విల‌న్‌గా, కామెడీ విల‌న్‌గా త‌న‌దైన ముద్ర‌వేసిన ఆయ‌న ద‌ర్శ‌కుడిగా కూడా ప‌లు ప్ర‌య‌త్నాలు చేశారు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌తో త‌న‌లోని ద‌ర్శ‌కుడిని సంతృప్తి ప‌ర‌చుకోవాల‌నుకున్నారు. కొన్ని ల‌ఘు చిత్రాల్ని రూపొందించారు కూడా అయినా ఆయ‌న‌లోని ద‌ర్శ‌కుడు సంతృప్తి చెంద‌క‌పోవ‌డంతో రెండే రెండు పాత్ర‌ల‌తో ప్ర‌యోగాత్మ‌కంగా `మిథునం` చిత్రాన్ని కూపొందించారు.

తొలి చిత్రంతోనే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప‌లుఅవార్డుల్ని సొంతం చేసుకున్నారు. ఆ సినిమా త‌రువాత ద‌ర్శ‌కుడిగా కొంత విరామం తీసుకున్న ఆయ‌న‌  మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో `భ‌క్త క‌న్న‌ప్ప‌`ని రీమేక్ చేయాల‌నుకున్నారు. కానీ ఆ ప్ర‌య‌త్నం కుద‌ర‌లేదు. దాంతో సైలెంట్ సినిమాలు చేసుకుంటున్న ఆయ‌న తాజాగా మ‌రో చిత్రానికి శ్రీ‌కారం చుడుతున్నార‌ని వార్త‌లు వినిపిస‌స్తున్నాయి.

హృధ్య‌మైన క‌థ‌తో, సున్నిత‌మైన భావోద్వేగాల నేప‌థ్యంలో త‌నికెళ్ల భ‌ర‌ణి ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురానున్నార‌ట‌. విభిన్న‌మైన క‌థ‌తో రూపొంద‌నున్న ఈ చిత్రానికి `అమ్మ బ్ర‌తికే వుంది` అనే టైటిల్‌ని త‌నికెళ్ల భ‌ర‌ణి ఖ‌రారు చేసిన‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రంలో షావుకారు జాన‌కి టైటిల్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. ఇక ఈ చిత్రాన్ని స్వ‌యంగా త‌నికెళ్ల భ‌ర‌ణి నిర్మించ‌నున్నార‌ని, దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని స్వ‌యంగా త‌నికెళ్ల భ‌ర‌ణి మీడియాకు వెల్ల‌డించ‌నున్నార‌ని తెలిసింది.