త‌నికెళ్ల భ‌ర‌ణి మ‌ళ్లీ మెగాఫోన్ ప‌డుతున్నారా?

త‌నికెళ్ల భ‌ర‌ణి మ‌ళ్లీ మెగాఫోన్ ప‌డుతున్నారా?
త‌నికెళ్ల భ‌ర‌ణి మ‌ళ్లీ మెగాఫోన్ ప‌డుతున్నారా?

త‌నికెళ్ల భ‌ర‌ణి మంచి న‌టుడే కాదు గుడ్ రైట‌ర్ కూడా. సంచ‌ల‌న చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన ఆయ‌న `మిథునం` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన విష‌యం తెలిసిందే. ఈ మూవీతో జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న ఆయ‌న మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్ట‌బోతున్నారు. అయితే అది ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్రరావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అని వార్త‌లు వినిపిస్తున్నాయి.

శ్రీ‌కాంత్ హీరోగా కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో 1996లో వ‌చ్చిన చిత్రం `పెళ్లిసంద‌డి`. అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా `పెళ్లిసందD`ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఈ మూవీలో హీరోగా హీరో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా న‌టించనున్నాడు. ఇటీవ‌లే ఈ విష‌యాన్ని కె. రాఘ‌వేంద్ర‌రావు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

ఈ సీక్వెల్‌కు రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌బోతున్నారు. ద‌ర్శ‌కురాలిగా ఈ మూవీ ద్వారా గౌరీ రోన‌న్‌ ప‌రిచ‌యం కాబోతోంది. అయితే ఆ స్థానంలో త‌నికెళ్ల భ‌ర‌ణికి అవ‌కాశం ఇవ్వాల‌ని రాఘ‌వేంద్ర‌రావు భావిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలిసింది. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ య‌మ స్పీడుగా జ‌రుగుతోంది. మ‌రి రాఘ‌వేంద్ర‌రావు మాటకు భ‌ర‌ణి సై అంటారా లేదా అన్నది త్వ‌ర‌లోనే అధికారికంగా బ‌య‌ట‌కు రానుంది.