తన మీద హోప్స్ పెంచుకోవచ్చు అంటున్న తాన్య…


Tanya Hope
తన మీద హోప్స్ పెంచుకోవచ్చు అంటున్న తాన్య…

మొదట చెప్పుకోలేని, అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు చేసింది. వాటి నుండి తనకి అవకాశాలు వచ్చాయంటే ఎవరైనా ఏమనుకుంటారు? హోప్స్ పెంచేసుకుంటారు, పర్లేదు మీరు హోప్స్ పెంచుకోండి నేను సినిమాల పరంగా మిమ్మల్ని నా నటనతో పెప్పిస్తా అంటుంది “తాన్యా హోప్”

“నేను శైలజ” లో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్ర “అప్పట్లో ఒకడుండేవాడు” లో పాత్ర మంచిదే అయినా సినిమా సగం మందిని మాత్రమే మెప్పించింది “పటేల్ SIR” సినిమా ఫ్లాప్. ఇక తర్వాత వచ్చిన “పేపర్ బాయ్” సినిమాలో కథని మలుపు తిప్పే పాత్ర చేసి సినిమాకి అదనపు బలంగా నిలిచింది.

పేపర్ బాయ్ లో చేసిన తన పెర్ఫార్మన్స్ కి దర్శకుడు “వి.ఐ. ఆనంద్” గారు తనకి “డిస్కో రాజా” సినిమాకి అవకాశం ఇచ్చారు అని చెప్పింది. ఇందులో మన మాస్ మహారాజ్ “రవితేజ” గారు హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా లో “నేను (సైన్టిస్ట్) పాత్రలో నటిస్తున్నాను, ఈ సినిమాలో కూడా నాది కథను మలుపు తప్పే పాత్ర అని, రవితేజ గారి యాక్టింగ్ లెవెల్ కి మ్యాచ్ అయ్యేలా బాగా కష్టపడ్డాను” అంటుంది .

ఈ మధ్య తనని ఈ సినిమా గురించి ప్రశ్న అడగగా అలా చెప్పుకుంటూ తన ఆనందాన్ని వెలిబుచ్చింది, చూద్దాం హోప్స్ పెంచుకోండి అంటున్న తాన్యా హోప్ గారి కల డిస్కో రాజా తో అయినా తనకి ఇంకా తెలుగులో మంచి మంచి పాత్రలు దక్కాలి అని వేడుకుందాం.

 

View this post on Instagram

 

#Discoraja ? Styled by @aayeshaa.mariam ? by @magantisairam

A post shared by Tanya Hope (@hope.tanya) on

Credit: Instagram