తాప్సీ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టేసింది!


తాప్సీ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టేసింది!
తాప్సీ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టేసింది!

టాలీవుడ్ వ‌దిలేసిన తాప్సీ ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో న‌ట‌న‌కు ప్రాధాన్యం వున్న చిత్రాల్లో న‌టిస్తూ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ప్ర‌ధానంగా ఉమెన్ సెంట్రిక్ చిత్రాల్లో న‌టిస్తూ పలు అవార్డుల్ని ద‌క్కించుకుంది. అదే స్థాయిలో వివాదాల్లోనూ చిక్కుకుంటూ వార్త‌ల్లో నిలుస్తోంది. `సాండ్ కీ ఆంఖ్‌` సినిమా స‌మ‌యంలో కంగ‌న ర‌నౌత్ సిస్ట‌ర్ రంగోలి చందేల్ కార‌ణంగా వార్త‌ల్లో నిలిచిన తాప్సీ తాజాగా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

తాజాగా ఓ మీడియా కిచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న బాయ్ ఫ్రెండ్ విష‌యంలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. గ‌త కొంత కాలంగా డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ మాథ్యూస్ బోయేతో ప్రేమ‌లో వుంది. ఈ విష‌యాన్ని గ‌త కొంత కాలంగా వెల్ల‌డించ‌ని తాప్సీ తాజాగా త‌న బాయ్ ఫ్రెండ్ ఎవ‌రో చెప్పేసింది. మాథ్యూ బోయేతో గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో వున్నాన‌ని, త‌మ‌ ప్రేమని త‌ల్లిదండ్రులు అంగీక‌రించాని, అయితే త‌న ప్రేమ‌ని త‌న పేరెంట్స్ అంగీక‌రించి వుండ‌క‌పోతే మ‌ధ్య‌లోనే బ్రేక‌ప్ చెప్పేసేదాన‌న్నని వెల్ల‌డించింది.

బోయునే ప్రేమించ‌డం గ‌ర్వంగా భావిస్తున్నాన‌ని, న‌టిగా గుర్తింపు తెచ్చుకున్న త‌రువాత అత‌ని పేరు చెప్పాల‌నుకున్నాన‌ని, అది ఇప్ప‌టికి కుదిరింద‌ని తాస్సీ వెల్ల‌డించింది. ఇటీవ‌ల తాప్సీ న‌టించిన పింక్, బ‌ద్లా, త‌ప్ప‌డ్ చిత్రాలు మంచి విజ‌యాన్ని సాధించ‌మే కాకుండా న‌టిగా తాప్సీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.