అల్లు అర్జున్ కోసం తారక్ రావట్లేదా?


tarak might not attend ala vaikunthapuramulo pre release event
tarak might not attend ala vaikunthapuramulo pre release event

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న చిత్రం అల వైకుంఠపురములో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. నవంబర్ కే షూటింగ్ మొత్తం పూర్తి చేద్దామనుకున్నా కూడా అనుకోని కారణాల వల్ల ఆలస్యమైంది. మరో 7 రోజుల షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే అల వైకుంఠపురములో చిత్రానికి పబ్లిసిటీ ఓ రేంజ్ లో చేస్తున్న విషయం తెల్సిందే.

సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాకు పోటీగా మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు. అల వైకుంఠపురములో నుండి మూడు పాటలు రిలీజ్ అవ్వగా అందులో రెండు పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. యూట్యూబ్ లో సామజవరగమన 100 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతుండగా, రాములో రాముల కూడా 100 మిలియన్ వైపు ప్రయాణిస్తోంది. ఇక ఈ సినిమా టీజర్ కు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. 500K లైక్స్ కు చేరువలో ఉంది ఈ టీజర్.

ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అదిరిపోయే రేంజ్ లో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి ఫస్ట్ వీక్ లో నిర్వహిద్దామని అనుకుంటున్నట్లు, దానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ కు అటు అల్లు అర్జున్ తో, ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మంచి అనుబంధం ఉంది. దీంతో ఈ వార్తలు నిజమే అని అందరూ అనుకున్నారు.

అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం తారక్ ఈ ఈవెంట్ కు రావట్లేదట. అల వైకుంఠపురములో టీమ్ ఇంకా ఈ ఈవెంట్ గురించి ఎటువంటి ఆలోచన చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతం టీమ్ ఫోకస్ అంతా షూటింగ్ పూర్తి చేయడంపైనే ఉందని, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఓ కొలిక్కి తీసుకురావాలి.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అప్పటికి ఒక ఐదు రోజుల ముందు ఆలోచించుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారు. మరి అప్పటికైనా తారక్ ను పిలిచే ఆలోచన చేస్తారో లేదో.