తరుణ్ భాస్కర్ రెండో హిట్ కొట్టాడు కానీ ….


tarun bhaskar gets second hit butపెళ్లి చూపులు చిత్రంతో తెలుగునాట సంచలనం సృష్టించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ , అయితే ఆ సినిమా తర్వాత దాదాపు రెండేళ్ళ సమయం తర్వాత చేసిన చిత్రం ” ఈ నగరానికి ఏమైంది ” . నిన్న విడుదలైన ఈ చిత్రానికి యువత జేజేలు పలుకుతున్నారు, అయితే అదే సమయంలో ఓ షార్ట్ ఫిలిం చూసినట్లు ఉంది అని కామెంట్ చేస్తున్నారు . అంతేకాదు ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందడం కష్టమని , కేవలం మల్టిప్లెక్స్ సినిమా మాత్రమే అని అంటున్నారు . నలుగురు యువకుల జీవితాలకు సంబందించిన కథ గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది చిత్రం మల్టిప్లెక్స్ చిత్రం అని టాక్ వస్తున్నప్పటికీ పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాని చూసి దర్శకులు తరుణ్ భాస్కర్ ని అభినందిస్తున్నారు .

 

పెళ్లి చూపులు సాధించిన విజయంతో సురేష్ బాబు తన బ్యానర్ లో వరుసగా మూడు సినిమాలు చేయాలనీ తరుణ్ భాస్కర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు . అందులో భాగంగా ఈ నగరానికి ఏమైంది చిత్రం వచ్చింది కాగా ఇప్పుడు మరో రెండు సినిమాలు కూడా సురేష్ ప్రొడక్షన్స్ లోనే చేయాల్సి ఉంది తరుణ్ భాస్కర్ కు . రెండు సినిమాలు అంటే ఈజీగా మూడేళ్ళ కాలం పట్టొచ్చు ఆ తర్వాతే బయటి సినిమాలు అంగీకరిస్తాడు తరుణ్ భాస్కర్ . పెళ్లి చూపులు చిత్రం సాలిడ్ హిట్ కాగా ఈ నగరానికి ఏమైంది మాత్రం ఆ స్థాయి హిట్ కాదు అని చాలా స్పష్టమైపోయింది . తరుణ్ తదుపరి సినిమా రానా లేక వెంకటేష్ తో ఉండొచ్చు అని తెలుస్తోంది .