టాక్సీవాలా భామకు మరో ఛాన్స్ వచ్చింది


Taxiwaala girl Priyanka Jawalkar gets Niharika Konidela rejected movie
Taxiwaala girl Priyanka Jawalkar gets Niharika Konidela rejected movie

విజయ్ దేవరకొండ సరసన టాక్సీవాలా చిత్రంలో నటించిన ప్రియాంక జవాల్కర్ కు ఎట్టకేలకు ఛాన్స్ వచ్చిది. దాంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ భామ. టాక్సీవాలా చిత్రం హిట్ అయ్యాక ఈ భామ చాలా బిజీ అవుతుందని అనుకున్నారు కానీ అలా ఛాన్స్ లు రాలేదు దాంతో హాట్ హాట్ గా ఫోటోషూట్ కూడా చేసింది ప్రియాంక జవాల్కర్.

ఇక తాజాగా పెళ్లిచూపులు వంటి బ్లాక్ బస్టర్ తీసిన రాజ్ కందుకూరి తన కొడుకు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ చూసి చూడంగానే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు కాగా ఆ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ నటిస్తోంది. అయితే ఇందులో మొదట హీరోయిన్ గా నిహారిక ని తీసుకోవాలని అనుకున్నారట.

మెగా డాటర్ నిహారిక ఈ సినిమాలో నటించడానికి నిరాకరించడంతో ఆమె స్థానంలో ప్రియాంక జవాల్కర్ ని ఎంపిక చేసారు. లవ్ , రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రియాంక మాత్రమే రాజ్ కందుకూరి కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే తన వారసుడు హీరోగా పరిచయం అవుతున్న సినిమా మరి.