పవన్ కళ్యాణ్ పావలాకి కూడా పనికి రాడటజనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పైన నారా లోకేష్ పైన అదేపనిగా విమర్శలు చేస్తున్నాడని అసలు పావలాకు కూడా పనికిరాని పవన్ మా నాయకులను విమర్శించడం ఏంటి ? అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది తెలుగుదేశం పార్టీ సాధినేని యామిని . వారసత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ కు లేదని , సినిమారంగంలో చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ని స్టూడియో గేటు ముందుకు కూడా రానిచ్చేవాళ్ళు కాదని , అసలు పవన్ కళ్యాణ్ ని హీరోగా ఎవరు తీసుకునే వాళ్ళు చిరు అనే కేరాఫ్ అడ్రస్ లేకపోతే అంటూ పవన్ పై నిప్పులు చెరిగింది సాధినేని యామిని .

ఇటీవల పవన్ కళ్యాణ్ తరచుగా వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతూ అదేపనిగా నారా లోకేష్ పై విమర్శలు చేస్తున్నాడు . నారా లోకేష్ కనీసం సర్పంచ్ గా కూడా గెలవలేడని అలాంటి వాడికి పంచాయతీరాజ్ శాఖని కట్టబెట్టారని , కేవలం చంద్రబాబు నాయుడు కొడుకు అయితే మంత్రిగా అవకాశం కల్పిస్తారా ? అంటూ పవన్ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు పవన్ పై విరుచుకు పడుతున్నారు . ఇక సాధినేని యామిని అనే మహిళా ఏకంగా పవన్ కళ్యాణ్ పావలా పైసలకు కూడా పనికి రాడని ,మా లోకేష్ తలతలలాడే 2000 రూపాయల నోటు లాంటి వాడని అంటోంది .

English Title: TDP leader controversial comments on pawan kalyan