పవన్ జగన్ వెంట వెళుతున్నాడా


tdp leaders fire on pawan kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అధికార తెలుగుదేశం పార్టీ ని చంద్రబాబు నాయుడి ని అలాగే లోకేష్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేసాడు దాంతో ఒక్కసారిగా తెలుగుదేశం శ్రేణులు షాక్ కి గురయ్యాయి . నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ కి వెన్నుదన్ను గా నిలిచిన పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి తెలుగుదేశం ఎం ఎల్ ఏ లపై చంద్రబాబు పై లోకేష్ పై ఆరోపణలు చేయడం ఏంటని ఇదంతా బిజెపి ఆడిస్తున్న నాటకమని , జగన్ వెంట పవన్ కళ్యాణ్ వెళ్లే ఆలోచన ఉందేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నాయకులు .

 

2014 ఎన్నికల్లో టీడీపీ – బిజెపి కూటమి కి మద్దతు ఇచ్చాడు పవన్ కానీ 2019 ఎన్నికల్లో మాత్రం జగన్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తాడా ? అని భావిస్తున్నారు . పవన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడంతో తెలుగుదేశం శ్రేణులు పవన్ కళ్యాణ్ పై చాలా ఆగ్రహంగా ఉన్నారు .