విజయ్ దేవరకొండపై ప్రశంసలు


 TDP MP rammohan praises Vijay Devarakonda
ఆంధ్రప్రదేశ్ కు అండగా ఉంటానని ట్వీట్ చేస్తూ ముఖ్యమంత్రి సహాయనిధికి  5 లక్షల విరాళం అందించాడు హీరో విజయ్ దేవరకొండ దాంతో అతడి పై ప్రశంసల వర్షం కురుస్తోంది . ఇక శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు అయితే విజయ్ దేవరకొండని పొగడ్తలతో ముంచెత్తాడు . కష్టకాలంలో శ్రీకాకుళం కు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ కు శ్రీకాకుళం జిల్లా యావత్తు కృతఙ్ఞతలు తెలియజేస్తోందని ,మీరు చూపించిన ఔదార్యానికి మీ వెన్నెంటే ఉంటుంది మా జిల్లా అంటూ ట్వీట్ చేసాడు యువ రాజకీయ నాయకుడు రామ్మోహన్ నాయుడు .
విజయ్ దేవరకొండతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ , వరుణ్ తేజ్ , సంపూర్నేష్ బాబు , అనిల్ రావిపూడి లను ప్రశంసలతో ముంచెత్తాడు రామ్మోహన్ నాయుడు . తిత్లి తుఫాన్ భీభత్సం సృష్టించగా ఆంద్రప్రదేశ్ లోని శ్రీకాకుళం , విజయనగరం జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి . దాంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి కి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి . తుఫాన్ ధాటికి నష్టపోయిన వాళ్ళను స్వయంగా కలిసి దుప్పట్లు , బిస్కెట్లు , మంచి నీరు తదితర సామాగ్రి ఇచ్చాడు హీరో నిఖిల్ అండ్ కో .
English Title:  TDP MP rammohan praises Vijay Devarakonda