టీజ‌ర్ టాక్‌: బ‌న్నీ పంచ్‌లు.. మెరుపులు అదిరాయి


Teaser talk bunny steal the show
Teaser talk bunny steal the show

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న `అల వైకుంఠ‌పుర‌ములో` టీజ‌ర్ వ‌చ్చేసింది. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ నుంచే ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమా టీజ‌ర్‌లో అల్లు అర్జున్ మెరుపులు.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ చ‌మ‌క్కులు ఎలా వుండాయా అని అంతా గ‌త కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపుల‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ బుధ‌వారం సాయంత్రం `అల వైకుంఠ‌పుర‌ములో` టీజ‌ర్‌ని చిత్ర  బృందం రిలీజ్ చేసింది. అంతా ఊహించిన‌ట్టుగానే టీజ‌ర్‌లో అల్లువార‌బ్బాయి మెరుపులు..త్రివిక్ర‌మ్ చ‌మ‌క్కులు అదిరిపోయాయి.

టీజ‌క్ గ్లింప్స్‌ని షాపింల్‌గా వ‌దిలిన మేక‌ర్స్ టీజ‌ర్ ఎలా వుండ‌బోతుందో హింట్ ఇచ్చేశారు. బ‌న్నీరెడ్ క‌ల‌ర్ బ్లేజ‌ర్‌ని వేసుకుంటూ లిఫ్ట్‌లోంచి  బ‌య‌టికి వ‌చ్చే స‌న్నివేశం వ‌స్తుండ‌గా `మీ నాన్న నిన్ను పెళ్లి కూతుర్ని దాచిన‌ట్టు దాచాడు` అనే డైలాగ్‌లో టీజ‌ర్ మొద‌లైంది. `గ‌ట్టోడివి ..అంటూ స‌చిన్ ఖేడేక‌ర్ బ‌న్నీ వీపు తట్ట‌డం.. స్టైల్ బావుంది క‌దా నాక్కూడా న‌చ్చింది…. ఇన్ని పాట‌ల‌తో ప్యాక్ చేశాక డైలాగ్ లేద‌నా…మీరిప్పుడే కార్ దిగారు.. నేనిప్పుడే క్యారెక్ట‌ర్ ఎక్కా.. అంటూ బ‌న్నీ త‌న‌దైన స్టైల్లో చెప్పిన పంచ్ డైలాగ్‌లు అదిరిపోయాయి. టీజ‌ర్ ఎండింగ్‌లో పందెం కోడిని ప‌ట్టుకుని స్టైలిష్‌గా బ‌న్నీ వ‌స్తున్న తీరు ఆయ‌న అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటోంది. ఇక టీజ‌ర్‌లో ఆసాంతం బ‌న్నీ పంచ్‌లు.. మెరుపులు అద‌రిపోయాయి. యాక్ష‌న్ బ్లాక్స్‌…ఇప్ప‌టికే రిలీజైన త‌మ‌న్ పాట‌లు.. సినిమా ఓ రేంజ్‌లో వుండ‌బోతంద‌ని చెప్పేస్తున్నాయి.

సంక్రాంతి రేసులో పోటీకి దిగిన ఈ సినిమా ఇప్ప‌టికే త‌మ‌న్ అందించిన ఆడియోతో మొద‌టి స్థానాన్ని సొంతం చేసుకుంది. సామిత్య స‌వ్య‌సాచి సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన క్లాస్ సాంగ్ `సామ‌జ వ‌ర‌గ‌మ‌న‌..`, యువ గేయ ర‌చ‌యిత కాస‌ర్ల శ్యామ్ అందించిన `రాములో.. రాములా…` అటు మాస్‌ని, ఇటు క్లాస్‌ని ఆక‌ట్టుకుని యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టించి సినిమా విజ‌యంపై చిత్ర యూనిట్‌కు న‌మ్మ‌కాన్ని పెంచేశాయి. తత్రివిక్ర‌మ్‌తో క‌లిసి బ‌న్నీ ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి క‌లిసి న‌టిస్తున్న సినిమా ఇది కావ‌డంలో స‌హ‌జంగానే అంచ‌నాలు పెరిగాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని స్థాయిలో టీజ‌ర్ క‌నిపిస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల్లో ట‌బు, జ‌య‌రామ్‌, నివేదా పేతురాజ్‌, సుశాంత్‌, సునీల్‌, స‌ముద్ర‌ఖ‌ని, స‌త్య‌రాజ్‌, స‌చిన్ ఖేడేక‌ర్, ముర‌ళీశ‌ర్మ‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌టిస్తున్నారు. జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది.