సావిత్రి ఆ పోస్ట్ ఎందుకు తీసేసింది !


teenmar savithri
teenmar savithri

వి 6 ఛానల్ లో తీన్మార్ వార్తలు చదివే సావిత్రి బిగ్ బాస్ 3 లోకి ఎంటర్ అవుతున్నట్లు తెలుస్తోంది . కొన్ని రోజుల ముందుగానే తీన్మార్ సావిత్రి పేరు వినబడింది . ఇక తాజాగా ఆ విషయాన్నీ ధృవీకరిస్తూ నేను బిగ్ బాస్ 3 హౌజ్ లోకి ఎంటర్ అవుతున్నాను అంటూ ఓ పోస్ట్ పెట్టింది కూడా . అయితే ఏమయ్యిందో ఏమో ! కానీ ఆ పోస్ట్ డిలీట్ చేసింది సావిత్రి .

అలా డిలీట్ చేసింది అంటే ఖచ్చితంగా తీన్మార్ సావిత్రి సెలక్ట్ అయినట్లే కాకపోతే బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చే వాళ్ళని ఒక్కొక్కరిగా పరిచయం చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అలా పరిచయం చేసే వరకు బయటకు తెలియకూడదు కాబట్టే ఆ పోస్ట్ ని డిలీట్ చేసి ఉండొచ్చు . తీన్మార్ కార్యక్రమంతో బహుళ ప్రాచుర్యం పొందింది సావిత్రి . ఇక బిగ్ బాస్ లోకి వస్తే తెలంగాణ యాసతో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి .