బిగ్ బాస్ 3 లో తీన్మార్ సావిత్రి !


తెలుగునాట త్వరలోనే బిగ్ బాస్ 3 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే . కాగా ఆ షోలో తీన్మార్ సావిత్రి పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది . వి 6 ఛానల్ లో తీన్మార్ కార్యక్రమంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది సావిత్రి అలియాస్ జ్యోతి . బిత్తిరి సత్తి అక్కగా సావిత్రి తెలంగాణ మాండలికంలో చెప్పే డైలాగ్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారన్న విషయం తెలిసిందే .

బిత్తిరి సత్తి – సావిత్రి ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యింది బుల్లితెర మీద . సదరు ఛానల్ కు విపరీతమైన రేటింగ్ ని తెచ్చిపెట్టిన కార్యక్రమం ఈ తీన్మార్ . కాగా సావిత్రి అలియాస్ జ్యోతి బిగ్ బాస్ 3 లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది . నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ కార్యక్రమంలో గుత్తా జ్వాల , వరుణ్ సందేశ్ , కమల్ కామరాజు , జాకీ తదితరులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది .