`చిత్రం` సీక్వెల్ కోసం మ‌ళ్లీ క‌లిశారు!


`చిత్రం` సీక్వెల్ కోసం మ‌ళ్లీ క‌లిశారు!
`చిత్రం` సీక్వెల్ కోసం మ‌ళ్లీ క‌లిశారు!

తేజ సినిమా అంటే ఆర్పీ ప‌ట్నాయక్‌, సీమ‌ర్‌రెడ్డి, శంక‌ర్ ఈ ముగ్గురూ ఉండాల్సిదే. అయితే గ‌త కొంత కాలంగా ఈ ముగ్గురూ తేజ‌తో క‌లిసి ప్ర‌యాణం చేయ‌డం లేదు. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కి ఈ ముగ్గురు తేజ‌తో క‌లిసి ప‌నిచేయ‌బోతున్నారు. అదీ సెన్సేష‌న‌ల్ హిట్ ఫిల్మ్ `చిత్రం` సీక్వెల్ కోసం. చిన్న చిత్రాల‌కు పెద్ద ఊపునిచ్చి మూవీ `చిత్రం`. తెలుగు సినీ చ‌రిత్ర‌లో స‌రికొత్త ట్రెండ్‌ని సెట్ చేసిన ఈ మూవీకి త్వ‌ర‌లో సీక్వెల్‌ని చేయ‌బోతున్నారు.

దివంగ‌త న‌టుడు ఉద‌య్‌కిర‌ణ్‌, రిమా సేన్‌ల‌కు మంచి గుర్తింపుని తీసుకొచ్చిన చిత్ర‌మిది. మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌రువాత ఈ చిత్రానికి సీక్వెల్‌ని చేయ‌బోతున్నారు తేజ‌. సోమ‌వారం తేజ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా `చిత్రం` సీక్వెల్‌ని చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. `చిత్రం 1.1` పేరుతో ఈ సీక్వెల్‌ని చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

`చిత్రం` సినిమాకు ప‌నిచేసిన 45 మంచి టెక్నిక‌ల్ టీమ్ ఈ చిత్రానికి ప‌నిచేయ‌నుంద‌ట‌. ఈ ఏడాదే సెట్స్ పైకి రానున్న ఈ చిత్రానికి ఆర్పీ ప‌ట్నాయ‌క్ సంగీతం, స‌మీర్ రెడ్డి ఛాయాగ్ర‌హ‌ణం, శంక‌ర్ డ్యాన్స్ అందించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే న‌టీన‌టుల వివ‌రాల్ని వెల్ల‌డించ‌నున్నార‌ట‌.