మళ్ళీ తెరపైకి “జయం” కాంబినేషన్


Teja Gopichand New movie
Teja Gopichand New movie

నువ్వు వాడిని ప్రేమించినా ఫరవాలా… వాడితో పడుకున్నా ఫర్వాలా…! పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి..” అంటూ సదా గొంతు పట్టుకుని గోడకు ఎత్తి గోపీచంద్ డైలాగ్స్ చెప్తుంటే ఆడియెన్స్ స్టన్ అయిపోయారు. ఆ సినిమా క్లైమాక్స్ దాకా రఘు అనే క్యారెక్టర్ లో హీరో, హీరోయిన్స్ ని పరిగెత్తించిన గోపీచంద్ నటనకు యావత్ ఇండస్ట్రీ ఫిదా అయిపోయింది. ప్రత్యేకంగా సదా,నితిన్ ట్రైన్ లో పారిపోయేటప్పుడు సుమో పైన కూర్చొని చేజ్ చేసే సీన్ లో గోపీచంద్ ని చూపించిన షాట్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఆ తర్వాత కూడా మహేష్ బాబు “నిజం” సినిమాలో కూడా దేవుడు అనే పాత్రలో ఒదిగిపోయారు గోపీచంద్. ఇప్పుడు మళ్ళీ ఆ కాంబినేషన్ తెరపైకి రాబోతోందా.? అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

గతంలో గోపీచంద్ ని ఇండస్ట్రీ లో ఫోకస్ అయ్యేలా చేసిన తేజ ఒక విభిన్నమైన కథతో గోపీచంద్ తో మరో సినిమా చేయ్యబోతున్నారట. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకసారి రాణా ను “నేనే రాజు –నేనే మంత్రి” సినిమాలో రాధా జోగేంద్ర గా చూపించిన తేజ ఇప్పుడు మళ్ళీ “రాక్షస రాజ్యంలో రావణుడు” అనే కథ చెప్పి ఒప్పించారట. త్వరలో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఒకసారి మొదలుపెడితే పక్కా ప్లానింగ్ తో సినిమాను కంప్లీట్ చేసే తేజ తర్వాత వెంటనే గోపీచంద్ తో సినిమా చేసే అవకాషాలు ఉన్నాయి. ఇక గోపీ సర్ కూడా కరెక్ట్ క్యారక్టర్ పడితే సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేస్తాడనే పేరు ఉంది. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే ఆ సినిమా ఎన్ని సేన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో మరి.?