వ‌ర్మ బాట‌లో తేజ `ష్ స్టోరీస్‌`! 

Teja new web series SSShstories
Teja new web series SSShstories

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డానికి ముందు తేజ రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌ని ప్ర‌క‌టించారు. గోపీచంద్ హీరోగా అలిమేలు మంగ వెంక‌ట‌ర‌మ‌ణ‌`, రానా హీరోగా `రావ‌ణ రాజ్యంలో రాక్ష‌స‌రాజు`. ఈ రెండు చిత్రాల్లో ఏదీ మొద‌లుపెట్ట‌లేదు. క‌రోనా స్వైర విహారం చేస్తుండ‌టంతో సినిమాల‌ని ప్ర‌స్తుతానికి ప‌క్క‌న పెట్టి హాట్ కంటెంట్‌తో వెబ్ సిరీస్‌కి శ్రీ‌కారం చుట్టారు. త‌నే నిర్మాత‌గా మారి ఓ అడ‌ల్డ్ వెబ్ సిరీస్‌ని ప్లాన్ చేశారు. ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ కూడా చేశారు.

ఇంత‌లో క‌రోనా వైర‌స్ సోక‌డంతో తేజ ప్ర‌స్తుతం హోమ్ ఐసోలేష‌న్‌లో వుంటూ డాక్ట‌ర్ల సూచ‌న‌లు పాటిస్తున్నారు. అమెజాన్ కోసం తేజ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ కోసం `ష్ స్టోరీస్‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు తెలిసింది. గురువు వ‌ర్మ ఇటీవ‌ల `నేక్డ్`, క్లైమాక్స్ వంటి సీగ్రేడ్ చిత్రాల్ని నిర్మించి ఓటీటీకి అందించాడు. ఇదే సూత్రాన్ని ఫాలో కావాల‌ని ఫిక్స్ అయిన తేజ హాట్ కంటెంట్‌తో `ష్ స్టోరీస్‌`ని నిర్మిస్తున్నార‌ట‌.

ఈ వెబ్ సిరీస్‌కి తేజ శిష్యుడు రాకేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వ‌ర్మ `క‌రోనా వైర‌స్` ఫిల్మ్‌లో న‌టించిన దీక్షా గుత్తికొండ ఈ వెబ్ సిరీస్‌లో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇప్ప‌టికే ఫస్ట్ ఎపిసోడ్‌ని పూర్తి చేసిన తేజ ఎడిటింగ్ , పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు చేయిస్తున్నార‌ట‌. దాన్ని ముందు పెట్టి అమెజాన్‌తో కొత్త డీల్ సెట్ చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో తేజ వున్న‌ట్టు తెలిసింది.