తేజ స‌జ్జ `ఇస్క్‌‌‌‌` ట్రైల‌ర్‌కు టైమ్ ఫిక్స్‌!

తేజ స‌జ్జ `ఇష్క‌` ట్రైల‌ర్‌కు టైమ్ ఫిక్స్‌!
తేజ స‌జ్జ `ఇష్క‌` ట్రైల‌ర్‌కు టైమ్ ఫిక్స్‌!

`జోంబిరెడ్డి` మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజ స‌జ్జ తాజాగా మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. `ఇష్క్‌` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆర్‌.బి. చౌద‌రి స‌మర్ప‌ణ‌లో మెగా సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై ఎన్‌.వి.ప్ర‌సాద్‌, ప‌రాస్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వింక్‌ గ‌ళ్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.  ‌

య‌స్‌.య‌స్‌. రాజు ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. `నాట్ ఏ ల‌వ్ స్టోరీ` అనే ట్యాగ్ లైన్‌తో రూపొందుతున్న ఈ మూవీ ట్రైల‌ర్‌ని ఈ గురువారం ఉద‌యం 10:36 గంట‌ల‌కు మేక‌ర్స్ రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇదే విష‌యాన్ని తెలియ‌జేస్తూ కొత్త పోస్ట‌ర్ని బుధ‌వారం విడుద‌ల చేశారు. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లతో మంచి క్రేజ్ ఏర్ప‌డింది.

పైగా చాలా రోజుల త‌రువాత మెగా సూప‌ర్ గుడ్ ఫిలింస్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ మూవీని ఈ నెల 23న వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు. `జోంబిరెడ్డి` త‌రువాత  చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీపై తేజ స‌జ్జ భారీ అంచ‌నాలు పెట్టుకున్నార‌ట‌.